Sookti Satakam - Poetry (Telugu)

సూకి శీతీక౦

నూక్తి శతకం

శతకం ఒక నూతన ప్రయోగం

శతకాన్ని చదవడం (ప్రారంభించాను. అయితే చదువుతూ ముందుకుపోయే కొద్ది శతకంపై (పేమ పెరిగింది. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్లు విన్నాను గానీ సఫలీకృతమైనది కవిగారు మాత్రమే అని చెప్పగలను. ఎందుకు సఫలీకృతం అన్నానంటే శతకంలో వస్తురూపాల మధ్య సమతౌల్యం చాలా బాగా పండింది. సరళమైన భాష ఒకవిధంగా చెప్పాలంటే ఈనాడు వస్తున్న “వచన కవిత' కన్నా ఆటవెలదులే పాఠకుల హృదయాన్ని చాలా త్వరితగతిలో ఆకర్షించగలవన్నది అక్షరసత్యం. నిస్సందేహంగా చెప్పగలను శతకం పుస్తకరూపంలో వస్తే తెలుగు కవిత్వంలో ఇది ఒక కొత్త ప్రయోగం కాగలదు. కవికి కవిత్వం పట్ల అపారమైన (ప్రేమ వుంది. ఎక్కడా ఒక్క పద్యం లోనూ తప్పులు వెదక లేము. ఇది ప్రతి తెలుగుభాషాభిమాని చదవదగ్గ అమూల్య రత్సరాశి.

ఇంత మంచి శతకం ప్రచురిన్తున్నందుకు తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. అలాగే మానవుల్లో నైతిక విలువల్ని, భక్తితత్పరతను పెంపొందించే పద్యాల్ని రచించిన కవిగారికి హృదయపూర్వక అభినందనలు. |

- డాక్టర్‌ ఇక్పాల్‌ చంద్‌ 17.01.2007

IE fy WNT

నూక్తి శతకం ఆ---———

ప్రకాశకుల పలుకులు

కవితలల్లడం అందరికి సాధ్యం కాదు. ఇస్లామును తెలుసుకుని అందులో ఆటవెలదులు రాయడం, సూక్తులు పలుకడం అద్భుతం. శ్రీ చంద్రంగారు తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌ వారితో సన్నిహితులై. గద్య పద్య రచనలు చేసారు. కృషి ఫలితమే సూక్తి శతకం.

ప్రవక్త (స) ప్రవచనాల ఆధారంగా శ్రీ చంద్రంగారు శతకం రాయడం ఎంతైనా అభినందించదగ్గ విషయం.

చదువరులకు శతకం నతృలితాలు తప్పక

ప్రసాదిస్తుందని ఆశిస్తూ....

నూక్తి శతకం

Ca అనంత కరుణామయుడు అపారకృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో 1. పరులపట్ల ద్వేషభావమ్ము లేకుండ

కలసిమెలసి మెలగగలుగు గుణము సాధ్యపడిన జన్మసాఫల్యమే కదా! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

2. ఎట్లు బ్రతికినాడ? వెట్లు సంపాదించి ఖర్చుపెడితి? వెట్లు గడచె వయసు? జ్ఞానపరుడవై విచారించవలె సుంత దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

3. బ్రతుకుపైన గల్లు భాంతుల తొలగించు పరము గుర్తుచేయు తరచుగాను కాన గాంచవలయు ఘనుల సమాధులు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

4. _ (బతు కశాశ్వతమ్ము; వదలి సోమరి బుద్ధి తనకు విహితమైన పనుల నెల్ల చావు రాకముందె చక్కబెట్టగవలె దివ్య ప్రీ ముహమ్మదీయ సూక్తి

వయ

సూక్తి శతకం =

5. ఫలము లందుకొనగవలెనన్న సంకల్ప PU బలముతోడ కర్మ సలుపవలయు; x తాను తలచినదియె తనకు ప్రాప్తంబౌను దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

6. అందచందములను, ఆస్తిపాస్తులను దై వము గణించబోడు; పట్టి చూచు నంతరంగ మొకటి, ఆచరణమొకటి దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

7. శక్తి చాలినంత, సద్వర్తనముతో (బతుకు గడుపుచుందవలయు; మంచి పనుల కెవ్వరద్దుపడును లోకమ్మున? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

8. _ కనుల గప్పు కలిమి, కష్టబెట్టును లేమి, వెర్రి తలలువేయు వీరభక్తి; గతిని తప్పజేయు (శ్రుతిమించు నదియెల్ల దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

# DD

నూక్తి శతకం

9. తనకు మించు బరువు తలెత్తు కొన్నచో ఎటుల మోయగల్లు నెవ్వడైన? అట్టి చర్యలెల్ల అవమానకరములు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

10. (బతుకు తెరువులేక, పరుల యాచించు దు ర్లతిని వారసులకు కలుగనీక విడిచి కొంత ధనము కడతేరవలె తాను దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

11. కష్టతరము బ్రతుకు కట్టుబాటుల మధ్య గడుపునపుడు; సులభ గతిని గడచు కట్టుబాటు లెవియు పట్టించుకొనకున్న దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

12. ఆత్మ నిగ్రహించునతడు వివేకియౌ, మనసు నదపు చేసుకొనగలేని అతడె నిశ్చయముగ అసమర్ధు డగుగాక! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

ిడాడాడామాడాడనడానాడాలయానడాయ వల. డా యా దారా వడాల డాలు

సూక్తి శతకం

చ్త

13. గుంజ చుట్టు తిరుగు గుర్రము బంధింప బడిన, అటులె తప్పటడుగు పడిన, సజ్ఞనుండు పోడు సన్మార్గమును వీడి దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

14. సంఘ జీవనమ్ము సాగించుచున్నప్పు డాటు పోటు లుండు; నవి సహించు, చుండు నుత్తముండు; ఒంటరి బ్రతుకేల? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

15. జ్ఞాన బోధనమ్ము జరపించవలయును సులభతరము చేయవలయు నదియు; కోప మధికమైన గుణ మిచ్చు మౌనము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

16. తనకు నచ్చనట్టి పనిచేయు వ్యక్తిని నిలిపి తప్పటంచు పలుకకుండ నొప్పి కలుగకుండ చెప్పుట ఉచితము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

జ్ర

నూక్తి శతకం

17. పండితుని కలిసిన ఫలితమ్ము దక్కు ను పేక్ష సేయు టెల్ల వెర్రితనము; పండితుండు నష్టపడునట్టి దుందదు! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

18. ముఖ్య విషయములను ముమ్మారు పలికిన ఎదుటి వారు భావ మెరుగుటయును గుర్తులోన నుంచుకొనుటయు జరుగును దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

19. తల్లిదండ్రులు తమ పిల్లలకు బహూక రించదగిన వుండు నెన్నియైన; సాటిలేని వందు చదువు సంస్కారాలు దివ్యమీ ముహమ్మదీయ సూక్తి

20. మనిషి చావు పిదప కొనసాగునవి మూడు- మంచి పనులు, తాను పంచినట్టి జ్ఞాన సంపదయును, సత్‌సంతు చిరమౌచు దివ్య షీ ముహమ్మదీయ సూక్తి

సూక్తి శతకం

*

21. .తానెరింగియుండి, తనతోటి వానిని తప్పుదారి వైపు తిప్పు వాడు విడువదగినయట్టి విశ్వాసఘాతియౌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

22.. దైవ మార్గమునకు దారి జూపెడి విద్య అభ్యసించి, దాని నద్దు పెట్టి ఆస్తి పెంచుకొనుట అత్యంత హేయమౌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

23. ఎరిగియున్న దాని నారులు తన్నడుగంగ కప్పిపెట్టి దాని చెప్పకున్న తప్పు చేసినటులె తలపోయబడు నద్ది దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

24. దుర్మదాంధులైన 'దొరలి సమక్షాన నిలిచి మంచి చెడుల నిగ్గు తేల్చి సత్యవాక్కు పలుక సాహస మ్మగుగాద! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

pi

నూక్తి శతకం

25. చెడును చూడగానె చేతితో నద్దుము, కాని యెడల మాటనైన, నదియు కానిచో మనస్సులోనైన నిరసించు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

26. పైని వారు తమను పట్టించుకొనకున్న క్రిందివార లూరకుందు రెట్లు? అవసరాల కొరకు 'యత్నాలు’ సలుపరా? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

27. రెండు దారులెదుట నుండినచో, అందు సరళ మార్గమందు సాగు టొప్పు; కాని, తప్పుదారి కాకుండవలె నద్ది దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

28. ఉండి యుండవచ్చు ఉపవాసములు పెక్కు బొంకు లెపుడు మెప్పు పొందలేవు; బొంకువాడు దైవమున కిష్టుదెట్లాను? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నన

సూక్తి శతకం

శక

29. తీర్థయాత్ర కేగి తిరిగి వచ్చిన వాడు బుద్ధి గలిగియు పరిశుద్ధుడైన పాపమెరుగనట్టి పసిబిడ్డ అనవలె దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

30. చెమ్మ తగిలి ఇనుము చెడిపోవు నట్టులే మలిన మంటు హృదయములకు గూడ; 'మృత్యుజపము” వల్ల మేల్‌గల్లు నరులకు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

31. దినము చదువదగును దివ్యగ్రంథంబులు బుద్ధి నిలిపి యెంతొ శ్రద్ధ గలిగి; (శ్రద్ధ సడలగానె చాలించవలె నింక దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

32. తగదు కపటమును, ప్రదర్శనా బుద్ధియు, తగదు దొంగచూపు, తగదసత్య- వాక్కు వదల వలయు పరిశుద్ధలై జనుల్‌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నాాలానాాడా డాబా ాబాడా నాజి యినా. దదానపదుదనాడాచానాబనానాాడాడంలనాంల నడాలానాయాడాడాలాా

నూక్తి శతకం

33. మంచి పనులు చేసి మానసికానంద మనుభవించినట్టి యతడె చెడ్డ- వైన పనులు చేసి ఆవేదనము పొందు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

34. మొదలుపెట్టు పనిని తుదముట్టగా చేయ వలయుగాని, తగని పని యటంచు నడుమ తెలిసెనేని విడిచిపెట్టుట మేలు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

35. చిన్న-పెద్ద అనుచు ఎన్నగా పనిలేదు పాపమెంతదైన వర్ణ్యమౌను; పాపములకు దవ్వు పరుగెత్తిపోవలె దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

86. ధర్మమార్గమెపుడు తప్పినడువరా, దు పాధి సాధనమున బ్రతుకునందు కష్ట మెదురుపడిన, నష్టమ్ము కలిగిన దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

త్న

ర్న అననన వానిని

నూక్తి శతకం

37. చెడుగు సంస్క్మరింపబడబోదు చెడుతోడ మంచి వలన నద్ది మారగలదు; మురికి వలన మురికి పరిశుద్ధమగునెట్లు? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

38. పక్షులకు ఉపాధి ప్రాప్తించునట్టులే మానవులకు లభ్యమౌను తిండి; మానియుండరాదు మానవ యత్నముల్‌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

39. కష్ట సమయమందు కడునోర్పు వహించి, సంతసమ్మునందు శాంతుడగుచు ఉండగల్లు వాడె ఉత్తమ పురుషుండు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

40. మంచి కాని దెల్ల మనిషి నాకర్షించు మనసుకెక్కబోదు మంచి యెప్పుడు; మంచి చెడుల ఫలము లెంచుకోవలె జీవి దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూక్తి శతకం

41. లోకమందు పెక్కు లోపాలు కనిపించు ఒప్పులుండు మరియు తప్పులుండు; ఒప్పు లాచరించు టుత్తమ ధర్మమ్ము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

42. కోరుకొనగ రాదు పోరు శత్రువులతో కాని, పోరు తప్పదేని, అపుడు స్థయిర్యమూని పోరు సాగించవలయును దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

43. సద్భ్దుణంబులందు సహనంబు గొప్పది సహనమునకు మించు శక్తిలేదు; సహనశీలునకు అసాధ్యమ్ము కనరాదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

44. రణమునందు శత్రుగణముల నిర్దించి నట్టివాడు వీరుడనగ జనదు; కోపవహిన అణచుకొనువాడె శూరుడౌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

I Up I

నూక్తి శతకం త్తు

45. అదుపు తప్పగూడ దానంద సమయాన కోపమధికమైన శాప మౌను; హక్షులేని దాని నాశించుటయు తప్పె దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

46. అతని యింట తనకు ఆతిథ్య మర్యాద లందకున్న, ఆతడరుగుదేర అందజేయు టొప్ప నతిథి సత్మారముల్‌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

47. మరుగు కలుగుచోట మలమూత్రముల విస రించవలయుగాని, సిగ్గు మాలి బట్టబయలు చేయుటెట్టి సంస్కారంబు? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

48. తొందరపడి పోయి తొక్కిస లాడుచు ప్రార్థనలకు జనుట పాడికాదు; ముందు బయలేదేరి హుందాగ పోవలె దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూక్తి శతకం

49. ఘనుడ ననుచు తాను గర్వించు నల్పుడు, అణగి మణిగి యుండు ఘనుడు తాను; (ప్రజలు నిజమెరింగి వర్తించుచుందురు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

50. చేయి చాపరాదు చీటికి మాటికి ఒరుల ముందు; తప్పకున్న యెడల సజ్జనులను కోరి సాయమడుగవచ్చు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

51. ధనము కూడబెట్టుకొనుటయే సర్వస్వ మని తలంచు మనిషి ధనము చేతి కీలుబొమ్మవోలె క్రీడించు లోకాన దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

52. అహము లేని మనిషి అందరితో కూడి కలసిమెలసి బ్రతుక గలుగు, నెందు ఎచ్చు తగ్గులనుచు నెంచ దేనాడును. దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నాతల గ్ర) జననాలు

నూక్తి శతకం

58. దైవదాసులెపుడు జీవించవలె విలా సముల పొంతబోక; సంయమమ్ము గలిగి మసలువాడె గౌరవార్డుణడగు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

54. గర్వబుద్ధి వీడి, కలవార లవసర మ్ములను తీర్చుకొనిన పొదుపు గల్లి తప్పు పట్టరాదు- ధర్మగుణమ్మున్న దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

55. (శ్రోత మెప్పుగొనును క్లుప్త ప్రసంగంబు, విసువజేయు నిడివి పెరుగు కొలది; ప్రార్థనలకు కాలపరిమితు విడనేల? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

56. సతృలమ్ము లొసగు సత్మార్యములు-మాని వేయకుండ సతము చేయు టొప్పు; ఒకటొ రెండొ చేసి ఊరుకొనుట తప్పు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూకి శతకం

57. సగములోన విడువ సత్మార్యమైనను పూర్ణఫల మొసంగబోదు గాన పూర్తిచేయవలయు మొదలిడు కార్యంబు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

58. స్వార్థపరులె తరచు సమ్ముఖమ్మున జేరి స్తుతు లొనర్చుచుంద్రు గతులు తప్పి; అట్టి వారిని కనిపెట్టి యుండవలయు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

59. అంతరంగమున అహంకారమును పెంచు- కొనుచు వి(ర్రవీగ జనదు; కాని ఉచిత వేష భాష లొప్పె, తప్పనరాదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

60. ధనము గలుగువాడు ధనహీనునకు బోలె మనుట పిసినిగొట్టు తనమె అగును; కాన చేయవలయు దాన ధర్మమ్ములు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూక్తి శతకం

+

61. కాన్మనిచ్చి తిరిగి కాజేయు వానిని కుక్కతోడ పోల్చుకొనుట లెస్స; తాను కక్కినట్టి దానినే తిను కుక్క దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

62. పొరుగువాడు తిండి కరువుతో పస్తుండ కడుపు నిండ తాను కుడిచి యుంట మానవత్వమునకు మచ్చగా కేమౌను? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

63. పిలుపు లేని వాడు విందు కేగుట తప్పు, పిలుపు నందుకొనియు వెళ్లనట్టి- వాడు కూడ విధిని పాటించ నట్టులే దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

64. పాత్ర మట్టిదైన, బంగారు దైనను తనదు స్థితిని చాటుకొనుట తప్ప దాన నుంచబడు పదార్థమ్ము మారదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

+

నూక్తి శతకం

65. కష్టగతులు తనను కలవర పెట్టినన్‌ చావుకోరుకొనుట సబబు కాదు; సహజ మరణమునకె స్వాగత మీవలె దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

66. జరుగవచ్చుగాక పొరపాట్లు సంయమ నమ్ము గల్లి పని యొనర్చుచున్న అనుభవమ్ము వల్ల నతడు వివేకియౌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

67. కడుపు కాలునపుడు, కాల కృత్యమ్ముల అవసరమ్ము కల్లునపుడు, ప్రార్థ- నాదికముల యందు ఆసక్తి యెట్లుండు? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

68. మంచినీళ్ల రేవు, మనుజులు నిలుచుండ- గలుగు నీడ చోటు, కాలి దారి కలుషపరచరాదు మలమూత్రముల చేత దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

Es... © ER

సూక్తి శతకం

శు స్తై 69. (శోతృ జనుల యెదుట 'లొడలొడి వాగినన్‌ స్పష్టభావ మెరుకపడదొకపుడు; కాన మాటలాడగావలె మెల్లంగ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

70. “వేత్తి నోట నెపుడు ఎత్తి పొడుపులును, దూషణలును, తిట్లు దొరల రాదు; దొరలె నేని అతడు మరియాద కోల్పోవు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

71. శ్రళ తప్పు తిండి, వేళ తప్పు నిదుర, యాతనా మయము ప్రయాణమగుట సొంత యింట నుండు సుఖమందు దూరమౌ దివ్య షీ ముహమ్మదీయ సూక్తి

72. “ఇది” ప్రమాద మంచు ఎరిగి యుండియు గూడ చొరవబూని అందు జొచ్చు వాడు ఫలితములకు తానె బాధ్యుడై యుండును దివ్య షీ ముహమ్మదీయ సూక్తి

#

సూక్తి శతకం

శక్‌

73. (బ్రతుకు తెరువు కొరకు పరదేశముల కేగు- చున్న వార లింట నున్న తల్లి- దండ్రులను గురించి తలపోయవలె సుంత! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

74. సర్వ సృష్టిలోని సద్వస్తువుల కన్న మంచి నడత గల్లు మహిళ మిన్న; మహిళ వలన జరుగు మానవాభ్యుదయమ్ము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

75. సతిని నొక్క లోటు పతి గమనించినన్‌ పెంచుకొనగరాదు ద్వేషబుద్ది; నచ్చు గుణము లింక నాతిలో నుండవా? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

76. ఆలు మగలకును విడాకులు ధర్మ మ్మతమె అగును గాని, వ్రతము కాదు; తప్ప నపుడె వాని తలపెట్ట వలయును దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

పాయా

నూక్తి శతకం

78. దాన ముత్తమంబు తన కష్టఫలమైన; స్వజనములను తృప్తిపరచకుండ రే పరుల కిచ్చు టెపుడు పద్ధతి కాబోదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

78. కన్న బిడ్డలకును కాన్మ లిచ్చెడి వేళ భేద భావముండరాదు; తల్లి దండ్రు లుండవలయు ధర్మ స్వరూపులై దివ్య హ్స్‌ ముహమ్మదీయ సూక్తి

79. పొరుగు వారు తనను పొగడిరో తెగడిరో తెలుసుకొన్న చాలు, తెలియగలవు- తాను చేయు పనుల తకరారు లెల్లను దివ్య ట్రీ మహమ్మదీయ సూక్తి

80. అతిథి మేర మీరి ఆతిథేయునికి బృంది కలుగునంత వరకు నతని ఇల్లు వీడకుండు టేలాటి ధర్మమ్ము? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూక్తి శతకం

81. జీతమిచ్చి పనులు చేయించు చున్నను మానవత్వ మేల మరవ వలయు? సాటి మనుజులనుచు జాలి చూపగరాద? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

82. నెలవు నీడలేని బలహీన వర్గాల హక్కు లపహరించి, అణగద్రొక్కు నట్టి దేశమెపుడు అభివృద్ధి కనబోదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

83. ఆరుగాల మొక్క తీరుగా కష్టించి చెమట ధారపోసి, సిరుల బెంచు వార లెవ్వరనిన - బలహీన వర్గాలె దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

84. పొరుగువారు దుఃఖమున మున్గి యున్నచో తమకు పట్టనట్టు తప్పుకొనక, ఆదుకొనగవలయు ఆప్త బంధువు లట్లు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

Dm

నూక్తి శతకం

+

85. సంఘజీవనమున జనుల స్థాయిని బట్టి వ్యవహరించినపుడె పనులు జరుగు; కాని యెడల పనులు కావు సక్రమముగాన్‌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

86. వ్యక్తిగతములైన ప్రార్థనాదికములు జరుపవచ్చు నెంత సమయమైన; సాగదీయరాదు సామూహికమ్మైన దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

87. అనుదినమ్ము సేవలందించు పనివాడు విగత జీవుడైన విషయమెరిగి జాలి పడని వాడు సంస్మారి ఎట్లాను? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

88. దిక్కులేని వారి అక్కర దీర్పంగ కంకణమ్ము నెవరు కట్టుకొనునొ వాని మించు ధర్మవర్తనుండుండడు! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

ఆశ సూక్తి శతకం

89. అనవరతము సేవలందించు పశువుల నలసి నీరసించు నంతవరకు కనికరమ్ము మరచి కష్టపెట్టగ రాదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

90. (పేమ పొందవలయు, (పేమించవలయును ప్రేమ మయము జగము; ప్రేమలేని బ్రతుకు చవిటి పర్రవలె సారహీనమౌ దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

91. ముఖ్యమైన పనులు మొదలిడు వేళల అనుభవజ్ఞులైన “అయినవారి” సంప్రదింతురేని సతృలమ్ముండును దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

92. వ్యయము చేయగూడ దాదాయమును మించి, వచ్చుదానిని సరిపుచ్చుకొనిన తప్పుకొనగ వచ్చు దారిద్ర బాధలు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

తతా చా

నూక్తి శతకం

93. మంచి కొరకు పరితపించుటయు, సదభి ప్రాయముండుటయును పరమభక్తి భావమందునొక్క భాగమే అగుగాక దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

94. ఒక్కచోట మువ్వురున్నప్పు డిర్వురు చెవులు కొరుకుకొనుట చేటుదెచ్చు; మొగము ముడుచుకొనును మూడవ వాడింక! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

95. చనవుగల్లు బంధుజనులైన, ఎవరైన పరుల గదుల యందు చొరవజేసి అడుగు పెట్టగూడ దనుమతి లేకుండ దివ్య షీ ముహమ్మదీయ సూక్తి

96. మంచివారి పొందు మంచి పెంపొందించు, దుర్దనులను గూడ దొసగులంటు; సార్వజనిక మౌను సహవాస దోషమ్ము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూక్తి శతకం

97. కలహబుద్ధి కలిగి, కారుకూతలు కూసి, 'ఉలిపి కట్టె వోలె నుండు నతని దుష్టుడనుచు జనులు దూరస్థు లగుదురు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

98. చాటుమాటుగా కుసంస్కారు లొరుల హస్యముల నెరుంగ నాత్ర పడుచు చేయునట్టి వెల్ల శిక్షార్డ చర్యలే దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

99. సాటివారిపైన చాడీలు చెప్పెడి వారినెట్లు నమ్మవచ్చు? రేపు తమను గూర్చి పరుల దగ్గర చెప్పరా? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి 100. కర్ర నగ్ని కణము కాల్చి బూడిద చేయు

నటులె ఈర్ష్య మనసు నంటెనేని,

మంచి పనుల నెల్ల మరుగున పడవేయు

దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నూక్తి శతకం

త్తు

101. తగదు, తగదు గాక, ధర్మ సమ్మతము కా, దాకతాయి తనము నైన గాని ఆదరా దబద్ధమాడరా దెప్పుడు! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

102. తనదు కాని భూమి దౌర్దన్యముగా ఆ(క్ర మించి, అనుభవించు వంచకునకు చెప్పదగును కఠిన శిక్ష ఏదైనను దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

103. ఇచ్చుటయును తప్పె, పుచ్చుకొనుట తప్పె; తప్పు లంచగొండితనమ్ము; దాని వలన సంఘమెల్ల భష్టమైపోవును దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

104. పారితోషికమ్ము కోరి “సిఫారసు” చేయువాడు సంఘ సేవకుండె? వాడు పాప పంథ పట్టినవాడౌను దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

105. కాన్మ నియ్యజూప కాదనవలెగాని అప్పొసంగు వాడె అప్పు గొన్న వాని నుండి ఆశపడగూడ దట్టివి దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

106. అధిక లాభములకు ఆశించి, తిండి గిం- జలను దాచియుంచు స్వార్థపరుడు (ప్రబల శత్రువగును ప్రజకు, నపరాధియు! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

107. వైద్య వృత్తినందు బాధ్యతారహితులై అడుగుపెట్టరాదనర్హు లర్హ తలు గలట్టివారె తగుదు రా వృత్తికి దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

108. పిలుచుకొనగ వచ్చు కలవారలను; నిరు పేదలైన వారి పిలిచి పెట్టు విందు సతృ్ఫలమ్ము నందిచ్చుట నిజము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నో

Dm

చనానునవననులులునమయిములవయియివవావు నేర థో శ్రోత

109. ఎంతవారలైన ఏకాంత మందున స్త్రీల గూడియున్న చెడును బుద్ది; మనసు చపల మగుట మానవ నైజమ్ము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

110. అదరు బెదరు లేక అశ్లీల విషయాల పైన చర్చచేయు వారు మరియు వ్యాప్తి చేయు వారు నపరాధు లగుదురు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

111. నేరములను బట్టి నిర్ణీత శిక్షల నమలుపరచు టుచిత మగును; శిక్ష నిర్ణయించరాదు నేరస్థులను బట్టి దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

112. తప్పు కాని యెడల తమ నాయకుని మాట నచ్చకున్న వినుట మెచ్చబడును; తప్పు చెప్పెనేని తల ఊపగా రాదు దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

Me CD)

నూక్తి శతకం

+

113. పదుగురకును తాను బాధ్యుడైయున్న కా ర్యమును నిర్వహించు సమయమందు స్వీయ కార్యమట్లు చేయుట న్యాయము దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

114. పదవి కొరకు నెవడు (ప్రాకులాడునొ - వాడు పదవి కర్షుడగుట వట్టి మాట; మోజు లేని వాడే “పూజారి” అగుగాక! దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

115. ప్రజలచేత ఎన్నబడినట్టి నేతలు (ప్రజలు కోరుకొన్న ప్రతినిధులయి ప్రజల భుజము లెక్కి స్వారీ యొనర్హురు దివ్య మీ మహమ్మదీయ సూక్తి

116. స్వార్థపరుడు గాక, పక్షపాతము లేక ప్రజల మధ్య తీర్చు పలుకుటన్న కత్తి మీద సాము కాక మరేమౌను? దివ్య మీ ముహమ్మదీయ సూక్తి

నో

I.